గాంధీ మార్గమే మనందరికీ ఆచరణీయం ఆదర్శవంతం: జ్యోతుల

  • దుర్గాడ, గొల్లప్రోలు గాంధీ జయింతి ఉత్సవాలలో జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజకవర్గం: పూజ్య బాపూజీ అయిన మహాత్మా గాంధీ 154వ జన్మదినోత్సవం కార్యక్రమాలలో గొల్లప్రోలు నగరపంచాయతీ నందు గల గాంధీనగర్ నందు గల గాంధీ బొమ్మ వద్ద గొల్లప్రోలునగర పంచాయతీ జనసేన నాయకులు, జనసైనికులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్యోతుల శ్రీనివాసు ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఆయనకు ఘన నివాళులర్పించారు‌. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ భారత దేశంలో శాంతియుతంగా బ్రిటిష్ వారిపై పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో తనదైన పాత్రను మహాత్మా గాంధీ పోషించారని. అహింస, సత్యం, సత్యమేవ జయితే అనే సిద్ధాంతాలపై మహాత్మాగాంధీ శాంతియుతంగా పోరాడి రవి అస్తమించని సామ్రాజ్యమైన బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టారని వలస పాలనకు స్వస్తి చెప్పి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన భారతదేశానికి మహాత్మా గాంధీ బాపూజీ అంటే తండ్రి అయ్యిరు. గ్రామాలే భారతదేశానికి పట్టుకొమ్మలని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం,స్త్రీ స్వేచ్ఛ కోసం మహాత్మగాంధీ ఎనలేని కృషి చేశారని,కానీ నేటి వైయస్సార్ పార్టీ మన రాష్ట్రంలో చీకటరాజ్యం నడుపుతోందని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తతో ఉండి మన యొక్క స్వాతంత్ర్యాన్ని మనం పూర్తిగా అనుభవించాలని మహిళలు స్వేచ్ఛగా జీవించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు తలారి శ్రీను, కీర్తి చంటి, గరగ తాతాజీ, పిడకా బుజ్జి, గుండ్ర శ్రీను, అనిశెట్టి నూకరాజు, కర్రి రాజా, రెడ్నం వీరాస్వామి, కేశవరపు వీరబాబు, పిడక బాబురావు, దేవరరెడ్డి బుజ్జిబాబు, బిందాల దొరబాబు, గుండ్ర హరీష్ అనిశెట్టి రాజా, మానేపల్లి ప్రసాద్, బుడంకాయల దొరబాబు రామిశెట్టి చంద్రశేఖర్, చిన్నారి శివ, సురేష్, వీరమహిళలు యండపల్లి రామలక్ష్మి, పద్మ, అనిశెట్టి లోవ, మేడిబోయిన సత్యనారాయణ, రావుల తాతారావు, జ్యోతుల సీతారాంబాబు, మేడిబోయిన హరికృష్ణ, జ్యోతుల శివ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గొల్లప్రోలు నగర పంచాయతీ నందలి వివేకనంద శాంతి మందిరము నందు 154వ మహాత్మా గాంధీ జయంతోత్సవాలను ఘనంగా స్వచ్ఛ గొల్లప్రోలు వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిప్రియ సేవాసమితి వ్యవస్థ స్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా స్వామి వివేకానంద ఫోటో కి పూలమాలవేసి అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం బాపూజీ మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు పడాల కన్నారావు, కొసిరెడ్డి రాజా, కొమ్ము సత్యనారాయణ, కర్రీ కొండలరావు, కొసిరెడ్డి త్రిమూర్తులు, పెద్దిరెడ్ల వెంకట్రాజు, జ్యోతుల శివ, కంకటాల శ్రీనివాసు, భారతాల శేషారావు, గుదే నాగేశ్వరరావు, బత్తుల కొండలరావు, దర్శిపూడి విశ్వేశ్వరరావు, పోలినాటి సీతబాబు, మేడిబోయిన సత్యనారాయణ, రావుల తాతారావు, జ్యోతుల సీతారాంబాబు, మేడిబోయిన హరికృష్ణ, జ్యోతుల శివ,
తదితరులు పాల్గొన్నారు. అనంతరం గొల్లప్రోలు రూరల్ మండలం దుర్గాడ గ్రామమునందు ఆదిఆంధ్రపేటలో గల మహాత్మా గాంధీవిగ్రహం వద్ద మహాత్మా గాంధీ 154వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతోత్సవకమిటీ ఆహ్వానం మేరకు జనసేన నాయకులు, సాయిప్రియసేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ హరిజనగిరిజన ఉద్ధరణ కొరకు మహాత్మాగాంధీ అనేక ఉద్యమాలను చేసి భారత రాజ్యాంగం నందు వారికి ప్రత్యేక ప్రాతిపదికన సహాయం కావాలని ప్రతిపాదించిన వ్యక్తి మహాత్మాగాంధీ అంటరానితనం నివారణ కొరకు మహాత్మాగాంధీ ఎంతో కృషి చేశారని, కాబట్టి మహాత్మా గాంధీని మనందరం కూడా ఎల్లప్పుడూ స్మరించుకోవాలని అందరూ కూడా గాంధేయవాదంతో మన జీవనం గడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిబోయిన సత్యనారాయణ, రావుల తాతారావు, జ్యోతుల సీతారాంబాబు, మేడిబోయిన హరికృష్ణ, జ్యోతుల శివ, విప్పర్తి మరియ్యమ్మ, విప్పర్తి సుభద్ర, పెదపాటి లక్ష్మి, విప్పర్తి శ్రీను, విప్పర్తి లాజరు, పెదపాటి లోవరాజు, విప్పర్తి లోవరాజు, సంజీవ్, విప్పర్తి చంటి, విప్పర్తి దొంగయ్య, విప్పర్తి నాగయ్య తదితరుల పాల్గొన్నారు.