రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి బాల సుబ్రహ్మణ్యంను కలసిన గంగారపు

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి కమ్మవీధిలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మరియు జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలతో కలసి టీడీపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యంను ఆయన స్వగృహంలో కలసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పార్టీలు కలసి పనిచేయడం ఆయనని వైకుంఠ ఏకాదశి రోజున కలవడం చాలా సంతోషంగా ఉందని అందరూ ఐకమత్యంగా మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి గెలిపించుకొంటామని ఆశా భావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డెమ్మ, రూరల్ మండలం ఉపాధ్యక్షులు చంద్రశేఖర, రూరల్ మండలం జనరల్ సెక్రటరీ జంగాల గౌతమ్, పట్టణ జనరల్ సెక్రటరీ గండికోట లోకేష్, రామసముద్రం మండలం ఉపాధ్యక్షలు గడ్డం లక్ష్మిపతి, సెక్రటరీ జయ శేఖర్, రాజారెడ్డి,పట్టణ జనరల్ సెక్రటరీ జవిలి మోహన కృష్ణ, కుమార్, జనరల్ సెక్రటరీ ఆదినారాయణ, తెలుగుదేశం నాయకులు కంచర్ల శ్రీనివాసులు, పట్టణ సెక్రటరీ జనార్దన్, రూరల్ జనరల్ సెక్రటరీ పవన్ శంకర, గంగులప్ప పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.