వైసీపీ నాయకుల అవినీతి, దాష్టికాలపై ద్వజమెత్తిన గంగరపు రాందాస్ చౌదరి

మదనపల్లి: వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటినుండీ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి అరాచకాలు, ఆగడాలు ప్రతిపక్షం మీద రోజు రోజుకి పెరిగిపోతున్న వైసీపీ నాయకుల దాడులను జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగరపు రాందాస్ చౌదరి తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకులు అభివృద్ధి చేయకుండా మిగిలిన పనులను చేస్తున్నారని ప్రతిపక్షాల వాహనాల మీద దాడి చేయడం వ్యక్తిగత విమర్శలు చేయడం, కేసులు బనాయించడం చేస్తున్నారు. జగన్మోహనరెడ్డి ఏవి ఐతే ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉందో జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబకి కూడా అవే ఉన్నాయని, ప్రతిపక్షాలు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పది మంది అల్లరి ముకలను పెట్టి దాడి చేయించడం మగతనం అని అనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు వీళ్ల అందరికి మగతనం దమ్ము దైర్యం గురించి మాట్లాడటం తప్ప వేరేమాటే లేదని, మగతనం అంటే మా జనసేన పార్టీ తరపున చెప్తున్నా వినండి.. మగతనం అంటే ఆడిన మాట తప్పడం కాదు, గత ఎన్నికల మేనిఫెస్టో లో అంచెలు, అంచెలుగా మద్యపాన నిషేదం అమాలులోనికి తీసుకొచ్చ్చి 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం అన్నారు. దాన్ని నిలుపుకోవటం మగతనం, అధికారంలోకి వచ్చిన వారం లోపు సి.పి.ఎస్ రద్దు చేసి ఉంటే అది మగతనం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు రిలీజ్ చేసి కొన్ని లక్షల మందికి జాబ్ ఇఛ్చినట్లయితే అది మగతనం, పేదలకి 5 రూపాయలకే అన్నం పెట్టె అన్నా కాంటీన్ లను ముసివేయడం అది కాదు మగతనం. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల కాలం పూర్తి ఐయి 5వ సంవత్సరంలో వుంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి రాజధాని లేదు. అది మగతనమా..? మదనపల్లి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ నింపకపోవడం హంద్రీ నీవా నీటిని మదనపల్లి ప్రజల గొంతులను ఎండగట్టి పుంగునూర్ కి తరలించారు. ప్రతిపక్షాలు మీద రాళ్లు వేయించడం కార్యక్రమాలకి ఇబ్బంది పెట్టడం కాదు మగతనం అంటే, మదనపల్లి, పీలేరు, పుంగునుర్, తంబళ్లపల్లి ప్రజల కోరిక మేరకు మదనపల్లిని జిల్లాగా ప్రకటంచి అపుడు మాట్లాడండి మగతనం గురించి అని విమర్శించారు. అలాగే మన మదనపల్లిలో ఉండే అంత ట్రాపిక్ రాష్ట్రంలో ఎక్కడిలేదని, మదనపల్లి లో సగం ఉండే రాయచోటిలో ట్రాపిక్ సిగ్నల్స్ పెట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా ఉన్నారు అది మదనపల్లి లో చేయండి అది మగతనం, ముస్లింలకి వివాహలకి షాదీ మహల్ లేదు అది నిర్మిచండి, నిన్న మొన్న టొమోటో రైతులకి గిట్టు బాటు ధర లేదు అది కల్పించండి, చేనేత లని ఆదుకోండి అది మగతనం అని తీవ్రంగా విమర్శిచారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకులు జగదీశ్, మదనపల్లి రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, జనార్దన్, లక్ష్మీపతి, పద్మావతి, శేఖర, కుమార్,స్వాతి, శంకర తదితరులు పాల్గొన్నారు.