అంధుడైన కోటేశ్వరరావుకు ఆర్థిక సహాయం అందించిన గర్భాన

పాలకొండ నియోజకవర్గం: స్థానిక పాలకొండ దేవరపేట వీధికి చెందిన కుర్ర కోటేశ్వరరావు పుట్టుకతో అంధుడు కావడంతో గత కొంత కాలంగా తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు వారి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి 8000 రూ ఆర్థిక సహయం అందచేయడం జరిగింది. ఆయనతో పాటుగా జనసేన నాయకులు గర్భాపు నరేంద్ర, మాధాసి సంతోష్ కుమార్, డొంపాక సాయి కుమార్, వారాడ సతీష్ కుమార్ పరామర్శించడం జరిగింది.