రోడ్ల దుస్థితి పై గిద్దలూరు జనసేన డిజిటల్ క్యాంపెయిన్

గిద్దలూరు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ద్వంశమైన రోడ్ల పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెలిసేలా మరియు నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి మేల్కొనెల పిలుపునిచ్చిన #GoodMorningCMsir కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం, బెస్తవారపేట మండలంలో మల్లాపురం మరియు సింగరపల్లి గ్రామాల్లో గిద్దలూరు నియోజకవర్గం ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు పర్యటించారు.

ఇంఛార్జి బెల్లంకొండ మాట్లాడుతూ బెస్తవారపేట నుండి మల్లాపురం రోడ్డు దాదాపు 9 కిలోమీటర్లు ప్రయాణించాలి అందులో కలగొట్ల గ్రామం మీదుగా 7 కిలోమీటర్లు దూరం పూర్తిగా పెద్ద, పెద్ద గోతులు వున్నవి, 10 సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులు రోడ్డు పట్టించుకున్న పాపాన పోలేదు, మల్లపురం గ్రామం వెళ్ళాలి అంటే గర్భిణీ స్త్రీలు, స్కూల్ పిల్లలు, వృద్ధులు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు, ఆటోలో పోవాలి అంటే 500 రూపాయలు అడుగు చున్నారు, ప్రభుత్వము తక్షణం స్పందించి రోడ్డు వేయాలని కోరారు మరియు సింగరపల్లి గ్రామము లో స్కూల్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు మీద గోతుల్లో వాటర్ నిలిచి వున్నది, ప్రజల కోసం వెంటనే రోడ్డు వేయాలని జనసేన పార్టీ డిమాండు చేస్తున్నాము, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నాయకులు లంకా నరసింహా రావు, కాల్వ బాల రంగయ్య, గజ్జలకొండ నారాయణ, రాచర్ల నాయకులు సిద్దం వెంకటేశ్వర్లు, అర్ధవీడు మండల అధ్యక్షుడు కలగోట్ల అల్లురయ్య, కంభం మండలం అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్ బైరా శేషాద్రి నాయుడు, శ్రీపతి కృష్ణయ్య, కొంకల రంగస్వామి, బెస్తవారపేట మండల నాయకులు ఇళ్ళురి అనిల్ కుమార్, కువ్వారపు దేవరాజు, తోటకురి కొండయ్య, చల్లగాలి ప్రవీణ్ కుమార్, దుమ్మని చెన్నయ్య, బోయళ్ళ పవన్ కుమార్, రెడ్డిమోయిన బాబు, గజ్జలకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.