జనసేన పార్టీ పిఏసి సభ్యులు నాగేంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు జనసైనికులు

జనసేన పార్టీ పిఏసి సభ్యులు నాగేంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు నియోజకవర్గం జనసైనికులు తోట సుబ్బారావు, కోటిపల్లి వెంకట ప్రసాద్, ఏడుకొండలు, బద్రీనాథ్ కిండర్, నరేష్ కట్టెల, రావుల వెంకటేశ్వర్లు, చందన చక్రవర్తి పటేల్. గిద్దలూరు నియోజకవర్గం గురించి ప్రజల బాగోగుల గురించి నాగబాబు తోట సుబ్బారావు ని అడిగి తెలుసుకున్నారు. అలాగే నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో గ్రామాలలో తిరిగి జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రజలకు అండగా నిలబడి వైసిపి దుశ్చర్యలను ఆపాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు.