సినిమా టిక్కెట్లపై దిగజారుడు రాజకీయాలు మాని, ప్రజా సంక్షేమంఫై దృష్టి పెట్టండి: త్యాడ రామకృష్ణారావు (బాలు)

*జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు
*తెల్లారితే తిట్టేది పవన్ కళ్యాణ్, చిరంజీవి తిరిగి వారి సినిమా టిక్కెట్లు మీకే కావాలి?
*ప్రజా ప్రతినిధులా? సినిమా టిక్కట్ల వ్యాపారస్తులా?
*స్థానిక ఎమ్మెల్యేపై మండిపడ్డ జనసేన నాయకుడు

విజయనగరంలో వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సినిమా టిక్కట్లపై దిగజారుడు రాజకీయాలు కాకుండా ప్రజా సంక్షేమంఫై దృష్టి పెట్టాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) అన్నారు. శుక్రవారం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సందర్బంగా విజయనగరంలో మెగాభిమానులకు, సామాన్యప్రజానీకానికి, అధికార పార్టీ నాయకులు, వైస్సార్సీపీ నాయకుల వద్ద అనుచరులైన చిరుఆభిమానుల ముసుగులో ఉన్న సీజనల్ వ్యాపారస్థులు టిక్కట్లు లేకుండా తీవ్ర అన్యాయం చేశారని శనివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో దుయ్యబట్టారు. తెల్లారితే రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ ను, చిరంజీవి ని తిట్టే వైస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు వారి సినిమాలు విడుదల అవ్వగానే వారి టిక్కట్లపై మాత్రం వ్యాపారం చేసుకోవడం విడ్డూరమని అన్నారు. ఇకపోతే ఈ ఆర్.ఆర్.ఆర్. సినిమా టిక్కట్లు ప్రతీ కార్పొరేటర్లకు స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా టిక్కట్లు ఇచ్చి ఒకొత్త సంస్కృతికి ఎమ్మెల్యే నాంది పలికారని, సంవత్సరం దాటినా విజయనగరంలో ఉన్న కాలువల్లో బ్లీచింగ్ వేయట్లేదు, ఈ దిగజారుడు రాజకీయాలు మాని, పాలకులు ప్రజాసంక్షేమంఫై దృష్టి పెట్టాలని అన్నారు.