గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 16వ రోజు

పాలకొండ నియోజకవర్గం, పాలకొండ జనసేన నాయకులు మత్స పుండరీకం, జనసేన జాని, కర్ణేన సాయి పవన్, దత్తి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 16వ రోజు సందర్భంగా మహిళా రైతుకూలీలకు ముందుగా దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న వీరఘట్టం జనసేన పార్టీ నాయకులు. మహిళా రైతు కూలీలు మాట్లాడుతూ మేము పొలం పనులకు దసుమంతపురం గ్రామం నుండి వీరఘట్టం పరిసరాల్లో పొలం పనులు చేస్తాము, పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి మాది, పండుగ పూట కూడా పని చేస్తున్నామన్నారు. ఇక్కడ నాలుగు నుండి ఆరు నెలలే పొలం పనులు ఉంటాయి మిగతా ఆరు నెలలు పనుల కోసం పట్టణాలకు వలసలు వెళ్ళవలసి ఉంటుంది. రోజు కూలి మూడు వందలు ఇస్తారని, నిత్యావసర వస్తువుల రోజువారి కొనుక్కోవడం సరిపోతాయని, మా గ్రామంలో తాగునీరు సమస్య ఉంది, అర్హులైన పేదలకు ఇళ్ళు, ఫెంక్షన్, ప్రభుత్వం పథకాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా వీరఘట్టం జనసైనికులు మత్స పుండరీకం, జనసేన జాని జనసేన పార్టీ మ్యానిఫెస్టోని ముఖ్యమైనవి ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, అరవై సంవత్సరలు దాటినా రైతులకు ఐదు వేల రూపాయల ఫెంక్షన్, ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆరోగ్య భీమా, ప్రతి మండల కేంద్రంలో ఉచిత భోజనశాల ఏర్పాటు చేస్తారని తెలిపారు. దత్తి గోపాలకృష్ణ, కర్ణేన సాయి పవన్ లు మాట్లాడుతూ ఉచిత గ్యాస్, ఇంటి నిర్మాణానికి ఉచిత ఇసుక, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించనున్నారు, నిరుపేద విద్యార్థులకు కేజి నుండి పిజి వరకు ఉచిత విద్య అందిస్తారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించాలని కోరారు.