గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 23వ రోజు

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన గిరిసేన 23వ రోజు కార్యక్రమంలో భాగంగా
మత్స పుండరికం మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకట్రావు తీసుకుంటున్న చర్యలు యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. జనసేన జానీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో యూనివర్సిటీలో చేపడుతున్న వివిధ విద్యా తిరోగమన చర్యలు, వివిధ విద్య అభివృద్ధి కార్యక్రమాలు, కంప్యూటర్లు కొనుగోలులో అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడం వంటి అంశాల పై తక్షణమే స్వతంత్ర సమస్థ చేత లేదా సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దత్తి గోపాల్ మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు డీన్ అయిన అడ్డయ్య మంగళవారం చేసిన పత్రికా ప్రకటనను ఖండిస్తున్నానని అన్నారు. సాయిపవన్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రాంత మేధావులను ఉద్యోగులకు విద్యార్థులను ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. దూసి ప్రణీత్ మాట్లాడుతూ ప్రధానంగా కంప్యూటర్ల కుంభకోణం యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలలో సకాలంలో సెమిస్టర్ పరీక్షలు జరుపకుండా కాలయాపన చేయటం మరియు జరిగిన పరీక్షలు తాలూకా ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యం జరగటం వారి యొక్క చర్యల వల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆడుకోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తపరిచారు. జరాజపు రాజు మాట్లాడుతూ డీన్ అడ్డయ్య సమయాన్ని రాజకీయాలు కన్నా విద్యార్థులు వ్రాసిన పరీక్షా ఫలితాల విడుదలలో చొరవ చూస్తే విద్యార్థులపై చదువుల భవిష్యత్తును కాపాడే వారవుతారని ఆయన హితవు పలికారు. సొండి సుమన్ మాట్లాడుతూ వక్రమార్గంలో వారి సిబ్బందిని తొలగించడం అన్యాయం అన్నారు. సమస్యను పెంచుకోవడం కానీ పరిష్కరించుకోవాలని సూచించారు. బొమ్మాళి వినోద్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తుతో అడ్డుకుంటే జనసేన పార్టీ విద్యార్థులకి అండగా ఉంటుందని చెప్పారు.