జనసేనకి ఒక్క అవకాశం ఇవ్వండి: ఎం. హనుమాన్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సమస్యలపై జనసేన రాష్ట్ర బీసీ నాయకులు మరియు న్యాయవాది ఎం.హనుమాన్ స్పందిస్తూ.. సమస్యల పరిష్కారానికి 2024లో జనసేనకి ఒక అవకాశం ఇవ్వాలని, మళ్లీ 2024లో వైఎస్ఆర్సిపికి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయని హనుమాన్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న ఏ ఒక్క సమస్యకూ అదికార ప్రభుత్వం పరిష్కారం చూపలేదు, నియోజకవర్గంలో ఉన్న రోడ్డు, డ్రైనేజ్, పేదలకు ఇస్తానన్న ఇళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే పశ్చిమ నియోజకవర్గం మొత్తం వలయంగా మారింది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వెల్లంపల్లి శ్రీనివాస్ గుమ్మం తొక్కితే కనీసం పట్టించుకోని పరిస్థితి నెలకొంది. పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి ఎక్కువైపోయింది, గడచిన మూడు సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదు. ప్రజల సమస్యలు తీర్చలేని నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్, గూగుల్ లో సెర్చ్ చేస్తే టాప్ 10మంది అవినీతి రాజకీయ నాయకుల్లో మూడో స్థానం, 4వ స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఉంటారు. అయితే ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తి, నేను ఉన్నానంటూ మీ సమస్యను తన సమస్య లా పరిష్కరించే వ్యక్తి జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన మహేష్, ఆయనకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ 2024లో ఒక్క అవకాశం ఇస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో, మంచి పరిపాలనతో మహేష్ ముందుకు తీసుకెళ్తారు. ఈ సరి జనసేనకు ఒక అవకాశం ఇచ్చి గాజు గ్లాస్ గుర్తుపై మీ ఓటు వేస్తే మహేష్ మీ ఇంట్లో ఒక బిడ్డలా, ప్రతి ఆడపడుచులకు ఒక అన్నలా, ప్రతి అవ్వ, తాతకి ఒక మనవడిలా మీ సమస్యని తన సమస్య అనుకుని పరిష్కరించే వ్యక్తి, న్యాయం కోసం పోరాడే వ్యక్తి, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పోతిన మహేష్, ప్రజల గుండెల మీద ఎక్కి తొక్కే నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్. కాబట్టి 2024లో జనసేనకు ఒక అవకాశం ఇచ్చి ప్రజలందరూ జనసేనను ఒకసారి నమ్మాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క అవకాశం జనసేనకి ఇస్తే రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను తీసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతామని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మన భవిష్యత్తు గురించి ఆలోచించి మన భవిష్యత్తు మన చేతుల్లో ఉందని మన చేతుల్లో ఉన్న ఓటే మనకు ఆయుధం, మన అమూల్యమైన ఓటును మంచి పార్టీ నాయకులకు వేసి మనం గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం, రానున్న రోజుల్లో మన భావితరాలకు ఇచ్చే భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయాలని ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని, జనసేన వైపు మీప్రయాణం ఉండాలని కోరుకుంటున్నాం అని ఎం.హనుమాన్ కోరారు.