కేసీఆర్ బర్త్‌డే.. బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఉదయం బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర సమర్పించనున్నారు. దాతల సహకారంతో రెండున్నర కిలోల బంగారంతో ఈ చీరను తయారు చేయించడం విశేషం.

ఇవాళ ఉదయం ఎల్లమ్మ అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, తొమ్మిది గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం నిర్వహించనున్నారు. అన్నప్రసాద పంపిణీ చేయనున్నారు. అలాగే ఉజ్జయినీ మహంకాళి, సికింద్రాబాద్‌ గణేష్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.