గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్ లో కదిరి జనసేన

కదిరి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న రహదారుల దుస్థితిని #GoodMorningCMSir అనే హేష్ టాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని కదిరి నుంచి అన్నమయ్య జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్లకార్డులతో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్ మాట్లాడుతు ఇప్పటికే ఈ రోడ్లపై చాలా మంది ప్రమాదానికి గురయ్యారు గౌరవ ముఖ్యమంత్రి తమ మంత్రిమండలి సమావేశంలో మాట్లాడుతూ జులై నెల 15 వ తారీఖు నాటికి రోడ్లు మొత్తం ఒక్క గుంత కూడా లేకుండా రోడ్లు వేసి ప్రతిపక్షాల నోరు మూయిస్తాను అని ప్రగల్భాలు పలికారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు కన్నా గుంతలే ఎక్కువగా ఉన్నాయి అయ్యా… వై ఎస్ జగన్ రెడ్డి ఒక్కసారి నిద్రలేచి ఇది చూసి రోడ్డు మరమ్మతులైనా పూర్తి చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే రోడ్డు వదిలేస్తే ఇక్కడి ప్రజలే మీకు బుద్ధి చెబుతారని జనసేన పార్టీ ఇంచార్జీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాండ్లపెఒట మండల కన్వీనర్ భుక్కే. రవీంద్ర నాయక్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు కూటల లక్ష్మణ, ఐటి వింగ్ కో ఆర్డినేటర్ పొరకల రాజేంద్ర ప్రసాద్, హరీష్ వాల్మీకి, హరి ప్రసాద్, బాలాజీ, వంశీ, హరీష్, నాగార్జున, భాస్కర్, రాము, గణేష్, నరసింహులు, తదితరులు పాల్గొనడం జరిగింది.