డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జనసేన

తిరుపతి, ఆ మహనీయుని 131వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి జనసేన పార్టీ తరపున స్థానిక బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ రూపకర్త సమసమాజ స్వాప్నికుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ నాయకులు బాబ్జి, జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, హేమ కుమార్, కీర్తన, మునస్వామి, సుమన్ బాబు, కృష్ణ, కిషోర్, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.