‘గుడ్‌లక్ సఖి’ టీజర్‌ విడుదల కి ‘గుడ్‌లక్’

కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘గుడ్‌లక్ సఖి’ టీజర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ఏక కాలంలో తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నిర్మాణమవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కీర్తి సురేశ్‌ గ్రామీణ ప్రాంత యువతిగా కనిపిస్తున్నారు. స్పోర్ట్స్ రామ్ కామ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్‌ షూటర్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఒక చిన్న షూటింగ్ షెడ్యూల్ మినహా మిగతా ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయి.