జనసైనికునికి చేయూతనిచ్చిన గోపాలపురం జనసేన

గోపాలపురం నియోజకవర్గం, ద్వారకాతిరుమల మండలం, గున్నంపల్లి గ్రామంలో జనసేన పార్టీ జనసేనకుడైనటువంటి దుక్కిపాటి రామకృష్ణ తల్లి నాలుగు రోజుల క్రిందట అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి, మండల అధ్యక్షులు మరియు గ్రామ నాయకుల సహకారంతో, సువర్ణ రాజు ఆధ్వర్యంలో 10,000 రూపాయలు నగదు, మరియు బియ్యం ప్యాకెట్ కిరాణా సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండల అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తి, మహంకాళి, నాగు, దేవరపల్లి మండల అధ్యక్షులు కాట్నం గణేష్, మాలే సతీష్, పోలుమాటి నాని, గ్రామ నాయకులు బాణాల వీరేంద్ర, కేశిరెడ్డి శేఖర్, అక్కిశెట్టి సుధాకర్, దుక్కిపాటి మురళీకృష్ణ, భీమడోలు రాములు, కొత్తపల్లి ప్రతాప్, చౌటపల్లి యేసు, జానకిరామ్, కూరెల్ల నవీన్, మరియు జనసైనికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.