పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన బత్తుల దంపతులు

రాజానగరం, పార్టీలో చేరిన దగ్గర నుండి, నియోజకవర్గం నలుమూలల అలుపన్నదే లేకుండా, రాత్రింభవళ్లు తిరుగుతూ… జనశ్రేణుల ద్వారా ఎవరికి, ఎక్కడ ఏ కష్టం ఉన్నదని తెలిసినా… మరుక్షణమే స్పందించి… బాధితుల కష్టాలు తెలుసుకుని, వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతులు ప్రజాసేవ చేయడంలో వారికి వారే సాటని మరోమారు నిరూపించుకున్నారు. కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో పలువురి ఇబ్బందులను జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకొని బిజీ షెడ్యూల్ కారణంగా మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వారిని కలిసి పరామర్శించడం జరిగింది.

  1. పురోహితుడు శ్రీనివాసరావుకి బైక్ యాక్సిడెంట్ అవడంతో వారిని పరామర్శించి, యోగక్షేమాలు తెలుసుకొని వైద్య ఖర్చుల నిమిత్తం 10,000/₹ రూపాయలు ఆర్థిక సహాయం చేసి, జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
  2. ప్రమాదంలో చేతికి గాయమైన ఆకుల అర్జున్ ని పరామర్శించి ప్రస్తుత పరిస్థితి తెలుసుకొని వైద్య ఖర్చులు నిమిత్తం 5,000/₹ రూపాయలు ఆర్థిక సహాయం అందించి, రానున్న రోజుల్లో పార్టీ తరుపున అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
  3. నడిపిండి భాస్కరరావుకి బైక్ యాక్సిడెంట్ కాగాఅవడంతో వారిని పలకరించి, యోగక్షేమాలు తెలుసుకొని త్వరగా కోలుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇవ్వడం జరిగింది.
  4. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అంబటి చిన్నాని పలకరించి, తనకు తెలిసిన డాక్టర్ ద్వారా వ్యాధిని నయం చేయిస్తానని హామీ ఇచ్చి తక్షణ ఖర్చులు నిమిత్తం 5,000/₹ రూపాయలు ఆర్థిక సహాయం అందించి తన మంచి మనసును మరోమారు చాటుకున్నారు “బత్తుల” దంపతులు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.