అనంతపురం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వైసిపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైజాగ్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు మరియు కార్యకర్తల పైన జరిగిన దాడులకు వ్యతిరేకంగా అనంతపురం నియోజకవర్గంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అనంతపురం లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, మేదర వెంకటేశ్వర్లు, పాలగిరి చరణ్ తేజ్, మెరుగు శ్రీనివాసులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.