రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: టి.సి.వరుణ్

శింగనమల నియోజకవర్గం, నార్పల మండలంలోని నాయనపల్లి, వెంకంపల్లి తదితర గ్రామాల్లో భారీగా కురిసిన వడగండ్ల వర్షాల వలన అరటి, చీని, మొక్కజొన్న, టమోట, వ్యవసాయ పాడే రైతులను ఆదుకోవాలని. జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ డిమాండ్ చేశారు. అనంతరం మంగళవారం అరటి, మొక్కజొన్న, చీని పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ మీడియా వారితో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా వడగండ్ల వర్షానికి పూర్తిగా అరటి, చీని, మొక్కజొన్న, టమోటా తదితరుల పంటల నేల మట్టం అయిందని తెలిపారు. నాయనపల్లి వెంకటంపల్లి ఆయా గ్రామాల పరిధిలో చేతుకొచ్చిన పంటలు నేలకొరిగి పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ బోరున విలపిస్తూ ఓక్కోకరము 10 ఏకరాలు, 5 ఏకరాలు, ప్రయివేటు వ్యక్తులు దగ్గర నుండి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసుకున్నాము. రేపో మాపో అరటిగెలలు కోట్టి ఆ వచ్చే సోమ్మును అప్పులు తీర్చుకుందామనుకుంటే మాయదారి పిడుగుల వర్షముతో పూర్తిగా జీవితాలు నాశనమయ్యాయి. నష్టపరిహరము ఇవ్వాలని ఒక్కొక రైతుకు 10లక్షల నుండి 30 లక్షలు వరకు అరటి, చీని, మొక్కజొన్న, టమోటా తదితరుల పంటలు నష్టపోవడం జరిగింది. ఈ రాష్ట ప్రభుత్వం వేంటనే అరటి, చీని రైతులకు ఏకరాకు 1లక్ష రూపాయలు వారి ఖాతాలో జమచేయాలని. మొక్కజొన్న, టమోటా, ఇతర పంటలకు ఒక ఏకరాకు 50,000/- వేల రూపాయలు నష్టపరిహరము అందించాలని. లేనియెడల జనసేన పార్టీ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ రైతులతో మాట్లాడుతూ మీరు ధైర్యంగా ఉండాలని భరోసా ఇస్తూ, అదేవిధంగా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శిలు రాపా ధనంజయ, చొప్ప చంద్రశేఖర్, కిరణ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, అవుకు విజయకుమార్, అనంతపురము నగర ఉపాధ్యక్షులు జెక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శి మేదర వెంకటేష్, నగర కార్యదర్శి నెట్టిగంటి హరీష్ రాయల్, తాడిపత్రి పట్టణ అధ్యక్షులు నరసింహాచారి, నార్పల మండలం ఉపాధ్యక్షులు శివయ్య, శింగనమల మండల అధ్యక్షులు ఓబులేసు, ఎర్రిస్వామి, చిన్న శ్రీరాములు, ప్రవీణ్ కుమార్, విశ్వనాథరెడ్డి, భాస్కర్, ఆది, నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.