జోరు వానలోనూ జోష్ తగ్గని జనసేన నాయకుల గ్రామపర్యటన

  • జనసేన నాయకుల గ్రామపర్యటన రెండవ రోజు

పాడేరు నియోజకవర్గం: జి.మాడుగుల మండలం, జనసేన పార్టీ నాయకులు గ్రామపర్యటనలో భాగంగా కంఠవరం, గొడుగుమామిడి, పచ్చనపల్లి, సొలభం, గిన్నెలి, పెదబయలు గ్రామాలను సందర్శించారు. ఈ గ్రామ పర్యటనలో ఆ గ్రామ ప్రజలతో మాట కలుపుతూ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న గిరిజన ద్రోహపు విధానాలపై నిర్వీర్యం కాబడుతున్నా గిరిజన హక్కులు, చట్టాలపై విస్తృత స్థాయి చర్చ చేస్తూ అవగాహన కల్పించారు. ప్రజల్లో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆశయాలు, లక్ష్యాలు రాష్ట్ర అభివృద్ధికి పారదర్శక రాజకీయం అవసరమంటూ అటువంటి విధానం కేవలం జనసేన పార్టీ ద్వారానే సాధ్యమని తెలియజేసారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జి.మాడుగుల మండల నాయకులు జనసేన పార్టీ గిరిజన సమస్యల పరిష్కారానికి కరపత్రాలు ప్రజలకు చేరవేస్తూ వారికి జనసేన పార్టీ నిర్దిష్ట లక్ష్యాలను వివరించారు. అలాగే మంగళవారం 18వ తేదీన జి.మాడుగుల మండలంలో జరగబోయే జనసేనపార్టీ భారీ ర్యాలీకి ప్రజలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ గ్రామ పర్యటనలో కిల్లో రాజన్ లీగల్ అడ్వైజర్, మసాడి భీమన్న మండల అధ్యక్షులు, తాంగుల రమేష్ కార్యనిర్వహన అధ్యక్షులు, కొర్ర భానుప్రసాద్ మండల నాయకులు పాల్గొన్నారు.