కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం

అంబాజీపేట: కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాచవరం రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు అంబాజీపేట మండలంలోని మాచవరం గ్రామంలో రైతు సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పలువురు కొబ్బరి రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలన కొబ్బరి రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కొబ్బరి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.7 ఉండగా రైతుకు సుమారు రూ.4 ఖర్చులు అవుతున్నాయన్నారు. కార్మికుల కొచ్చు రోజురోజుకు పెరుగుతుండడంతో ఆబారం కూడా రైతులపైనే పడుతుందన్నారు. ఈ తరహాలోనే ముందుకు సాగితే కొబ్బరి రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అని అన్నారు. కొబ్బరి రైతులకు ప్రభుత్వం అందిస్తానన్న ఆర్థిక సహాయం వాయిదాలు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అంబాజిపేట సొసైటి ఛైర్మెన్ కొర్లపాటి కోట బాబు, పొట్టుపోతు స్వామి నాయుడు, పత్తి దత్తుడు, మట్టపర్తి పరమేశ్వరరావు, సుంకర సత్యనారాయణ, గాదె సతీష్, రంకి రెడ్డి అబ్బులు, కొలిశెట్టి ప్రసాద్, కొత్తూరి వెంకటరమణమూర్తి, నక్కా భాస్కరరావు, నేలపూడి సత్యనారాయణ, బైరిశెట్టి సాయిబాబు, మోకా నాగేశ్వరరావు, నిట్టాల సాయి ప్రసాద్, అత్తిలి వెంకటేశ్వర రావు తదతరులు పాల్గొన్నారు.