సీఎం వాఖ్యలకు దారం అనిత కౌంటర్

మదనపల్లి: మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము ప్రశ్నిచాము దానికా మేము మీకు రౌడీ సేనలా కనిపించాము మరి మీరు, మీ ఎమ్మెల్యేలు మరియు మీ మంత్రివర్గం మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు, ప్రజలను భయ్య భ్రాన్తులకు గురిచేస్తూ చేసిన భౌతిక దాడులను ఏమనాలి? అంటూ ముఖ్యమంత్రి వాఖ్యలపై జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మండిపడ్డారు. ఈ సందర్బంగా అనిత మాట్లాడుతూ మీ ఎమ్మెల్యేలు చేసిన డ్రైవర్ హత్యను ఏమనాలి?, మీ మంత్రి జిప్పు తీసి మహిళకు చూపితే దానికి ఏం పేరు పెట్టాలి..? ఏల పిలవాలి?, మీ ప్రభుత్వం హయాంలో ఒక ప్రభుత్వ డాక్టరుని బర బర ఈడ్చుకు పోతే దానిని ఏమనాలి?, మీ సొంత బాబాయి హత్య వెనుక ఉన్న వారిని ఇంతవరకు పట్టుకోలేదు ఎందుకని?, అమలాపురంలో దాడులు చేసింది ఎవరు?.. వాటిని ప్రోత్సహించింది ఎవరు?, జనసైనికుడిని కొట్టి చంపింది ఎవరు?, ఇప్పటం గ్రామంలో ఇల్లు దౌర్జన్యంగా కూలగొట్టి అడ్డు వచ్చిన వారిని మీదకు వెళ్ళి దాడులు చేసింది ఎవరు?, ఉత్తరాంధ్రలో మహిళలను బ్రతికి ఉండాగనే మట్టితో పూడ్చిపెట్టినది ఎవరు?, రాజోలులో ప్రజల మీద దాడి చేసింది ఎవరు?, మీ మహిళ మంత్రి మధ్యవేలు వైజాగ్ కుర్రోల్లకి చూపిస్తే దానికి ఏం పేరు పెట్టాలి?, అయ్యా మీరు అంద్రప్రదేశ్ లో ఉన్న మట్టిని, ఇసుకను యధేచ్చగా తవ్వుకు పోతుంటే.. మీ మంత్రులు, ఎమ్మెల్యే, ఇష్టానుసారంగా బూతులుతిడుతుంటే, మీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు వయసులో ఉన్న కుర్రొళ్ళను మధ్య వేలు చూపించి రెచ్చగొడుతుంటే, ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేస్తుంటే, విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తుంటే, రైతుల చావులకు మీరు కారణం అయినప్పుడు చూస్తూ ఉంటుకుంటే, మహిళలపై, పసి బిడ్డపై అత్యాచారాలు జరిగిన కూడా వారు ఎవరో తెలిసిన కూడా మీరు చర్యలు తీసుకోక పోతే ఇంకా ఎన్నో ఎన్నెన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని తెలిసికూడా మీరు నోరు మెదపకుండా కూర్చుంటే, మేము మీరు వచ్చినపుడు మీ మీద మేము ఎలాంటి మాటల దాడులు కూడా చేయలేదు. మరి మేము నిజంగా రౌడీ సేన అయి ఉండి ఉంటే మీరు అసలు తిరగగలరా అండి. ఒక్కసారి ఆలోచించండి గమనించండి ప్రజలకి ఏవిధంగా మంచి చేయగలరు అని. గతంలో మీ ఎమ్మెల్యేలను లాకున్నడు కాబట్టి మాజీ ముఖ్యమంత్రిని మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకొండి. అంతేగానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మరియు జనసైనికులను మీరు అనడానికి అర్హులు కానే కాదని దారం అనిత మండిపడ్డారు.