రెండున్నర ఏళ్లలో హామీలు ఒక్క హామీ నెరవేర్చలేనీ ప్రభుత్వం: తాతంశెట్టి నాగేంద్ర

అధికార వైసిపికి 151 మంది ఎమ్మెల్యేలు, ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారిలో చాలా మంది ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని కలవాలంటే కలుసుకోలేని పరిస్థితులో ఉన్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర విమర్శించారు.

గురువారం జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశాన్ని కోడూరులోని పేర్ల సుబ్బారావు ఇండోర్‌ స్టేడియం వద్ద నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాగేంద్ర మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైనప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి బహిరంగ సభలో చెప్పారని గుర్తుచేశారు. సిపిఎస్‌ను ఎందుకు రద్దు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. వచ్చే ఏడాది నుండి జనంలోకి జనసేన పేరిట నూతన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత రాష్ట్ర కార్యదర్శిలతోపాటు జిల్లా అధ్యక్షులను దివిసీమ చరిత్రను తెలిపే విధంగా రూపొందించిన చిత్రపటాన్ని అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస్‌ విభాగ కార్యదర్శి లంకే యుగంధర్‌ రావు, జిల్లా కార్యదర్శులు గాజుల శంకర్రావు, సంయుక్త కార్యదర్శులు పద్యాల ప్రసాద్‌ ,ఉస్మాన్‌ షరీఫ్‌, లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి బాసు నాంచరయ్య నాయుడు, పార్టీ సీనియర్‌ నేత రాయపూడి వేణుగోపాలరావు, నేతలు మరే గంగయ్య, పిట్టలంక గ్రామ సర్పంచి కనగాల వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్‌ బావిశెట్టి ప్రభాకర్‌ రావు, కూరాకుల చంద్రశేఖర్‌, యర్రంశెట్టి దామోదరరావు, బాసు శివ ప్రసాద్‌, తోట సోమశేఖర రావు, తోట లక్ష్మణరావు, పెద్ది వెంకట్‌, బడే వెంకటేశ్వరరావు, మేడ పిచ్చయ్య, కోట ప్రసాద్‌, రేపల్లె మహేష్‌, నాగం రఘుతో పాటు పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.