అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి: యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ సంఘీభావం తెలియజేసింది. ఈ కార్యక్రమానికి జనసేన ఇంచార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డా యుగంధర్ పొన్న హాజరై మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులకు, హెల్పర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. గత ఎన్ని కల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలి. మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్లుగా మార్చాలి, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ను రూ.5 లక్షలకు పెంచాలి. ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్ ఇవ్వాలి. హెల్పర్ల ప్రమోషన్లలో నిబంధనలు రూపొందించాలి. రాజకీయ జోక్యం అరికట్టాలి. ప్రమోషన్ వయస్సు 50 సంవత్సరాలకి పెంచాలి. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. రూ.10 లక్షల బీమా అమలుచేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం పెంచాలి. వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. గ్యాసు సరఫరా ప్రభుత్వమే చేయాలి. పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, 2017 టీఏ బిల్లులు, ఇతర బకాయిలన్నీ వెంటనే చెల్లించాలి. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎఫ్.ఆర్.ఎస్ ను రుద్దు చేయాలి. మూడు యాప్లను రద్దు చేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలని డిమాండ్ చేసారు. ఈ డిమాండ్ లపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాటికీ పరిస్కారం చూపాలని డిమాండ్ చేసారు. అంగన్వాడీల ప్రతీ సమస్యను పవన్ కళ్యాణ్ కు తెలియజేసి, ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సాధించుకొనేలా, లేదా సరికొత్త ప్రజా ప్రభుత్వంలో సముచితమైన నిర్ణయం తీసుకొని, చక్కని పరిష్కారం చూపడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నరేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, మండల ఉపాధ్యక్షులు విజయ్, సెల్వి, టౌన్ ఉపాధ్యక్షులు సూర్య నర్సింహులు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, వెదురుకుప్ప మండలం యువజన అధ్యక్షులు సతీష్, ఇన్చార్జి సతీమణి స్రవంతి రెడ్డి, మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, నియోజకవర్గం బూత్ కన్వినర్ యతిశ్వర్ రెడ్డి, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి పాల్గొన్నారు.