ఘనంగా అడపా సురేంద్ర పుట్టినరోజు వేడుకలు

  • అందరినీ కలుపుకుని‌ వెళ్ళి సేవా భావంతో పని చేసే అందరివాడు అడపా సురేంద్ర
  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ ల కితాబు

మదనపల్లి: అందరినీ కలుపుకుని‌ వెళ్ళి సేవా భావంతో పని చేసే అందరివాడు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ ఆకాంక్షించారు. గురువారం అడపా సురేంద్ర పుట్టిన రోజు వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అడపా సురేంద్ర అభిమానులు, శ్రేయోభిలాషులు పూలమాలలు వేసి దుశ్శాలువులతో సన్మానించి, పూల బోకేలు అందించి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ నాయకులు, అభిమానులు అడపా సురేంద్రతో కేక్ కట్ చేయించి పంచిపెట్టారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. అడపా సురేంద్ర సేవా కార్యక్రమాలను కొనియాడారు. ‌ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజలకు చేరవేస్తూ, పవన్ కళ్యాణ్ సిఎం కావాలని ఆరాటపడుతున్న అడపా సురేంద్ర మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ మదనపల్లె నుండి పవనిజం కార్యక్రమాలు చేపట్టిన అడపా సురేంద్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత దగ్గరైనాడని అన్నారు. చేనేత కార్మికుల సమస్యల తెలిసిన వాడిగా విభాగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర చేనేత విభాగం ప్రదాన కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ నియమించడం జరిగిందని అన్నారు.‌ అడపా సురేంద్ర మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఐటి విభాగం నాయకులు జగదీష్ మాట్లాడుతూ అందరివాడు, జనసేన పార్టీ కోసం నిరంతరం తపించే అడపా సురేంద్ర మరిన్ని పుట్టిన రోజులు వేడుకలు జరుపుకోవాలని కోరుకున్నారు. అనంతరం అడపా సురేంద్ర మాట్లాడుతూ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.