కొండపల్లి మున్సిపాలిటీలో ఘనంగా చిరంజీవి జన్మదినవేడుకలు

మైలవరం నియోజకవర్గం: కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో కష్టాలను పడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో అవమానాలు భరిస్తూ తన కల నెరవేర్చుకుంటూ తను అనుకున్నది సాధించి ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రపంచ ఆదరణ పొందిన హీరో డా. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆయనకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కేక్ ను కోసి అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఇంచార్జి అక్కల. రామ మోహన్ రావు (గాంధీ), కొండపల్లి మున్సిపల్ నాయకులు బురగం శంకర్, చెరుకుమల్లి సురేష్, ఎర్రంశెట్టి సాయి, అరిగే కళ్యాణ్, సిరిపురం సురేష్, ఎర్రంశెట్టి సాంబ, పూల కొట్టు గణేష్, సామల సుజాత, పగిడిపల్లి వెంకీ, ఈశ్వర్ నాయుడు, బస్టాండ్ రాధ, అడపా శివ, గోపి, వీరా సాయి, రమేష్ అభిమానులు పాల్గొన్నారు.