ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

విజయవాడ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 7వ డివిజన్ లో జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుప్పట్లు, ఫ్రూట్స్, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ పంపిణీ చేయడం జరిగింది. మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మమ్మల్ని జనసేన పార్టీలోకి ఆహ్వానించి, దిశా నిర్దేశం చేస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తు, 7వ డివిజన్ ప్రజలకు అండగా, ప్రజా సమస్యలపై జనసేన పార్టీ తరపున పోరాడే విధంగా మమ్మల్ని సిద్ధం చేస్తున్న మా రాజకీయ గురువు 7వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు శ్రీ దోమకొండ అశోక్ గారికి డివిజన్ కమిటీ తరఫున శతధా సహస్రదా ధన్యవాదాలు తెలుపుతూ, డివిజన్ అధ్యక్షులు శ్రీమతి దోమకొండ మేరీ మరియు జనసేన పార్టీ నాయకులు, డివిజన్ ప్రజల సమక్షంలో డివిజన్ కమిటీ సభ్యులు అందరూ కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.