గుంటూరు జనసేన కార్యాలయంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

గుంటూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో గుంటురు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమల్ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.