గంపలగూడెంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గంపలగూడెం మండలం తోటమూల రింగ్ సెంటర్ వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. అనంతరం ర్యాలీగా బయలుదేరి దుండిరాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణ జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ.. గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ జెండా దినోత్సవం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం మంచి శుభదినము అని.. ప్రభుత్వం ఉచిత పథకాల పేరుతో ప్రజలను దండుకుంటుందని ఇటు తీసుకొని అటు ఖర్చుపెడుతుందని ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజలపై ఆర్థిక భారం వేస్తుందని ఎద్దేవా చేశారు. జగ్గయ్యపేటలో జనసేన జెండా కూల్చడాన్ని ఖండిస్తున్నామని.. అది జనసేన అంటే వైసీపీ నాయకులకు భయం పుట్టుకొచ్చి దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారని జనసేన పార్టీ గుండెకాయ లాంటిదని నిదర్శనమే వైసీపీ గుండాల అరాచకానికి నిదర్శనమని అర్థమైందని మాట్లాడటం జరిగింది. అనంతరం గంపలగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ.. గంపలగూడెం మండలంలో జనసేన పార్టీ బలంగా ఉందని రాబోయే రోజులు జనసేన పార్టీ ఇవే అనటానికి నిదర్శనం దుందిరాలపాడు హరిజనవాడ జనసేన దిమ్మె జండా ఆవిష్కరణ నిదర్శనమని.. ఇక్కడికి వచ్చినటువంటి యువతను చూసి అడుగు ప్రభంజనంలా జనసేన వైపు మొగ్గు చూపుతోందని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవి చేపట్టటం ఖాయమని ఉద్గాసించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మరియు తిరువూరు నియోజకవర్గ నాయకులు పగడాల లక్ష్మణరావు, గంపలగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకట కృష్ణారావు, ఉపాధ్యక్షులు బర్ల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిలు వట్టికుంట కృష్ణ, పసుపులేటి కిషోర్, కార్యదర్శి రామిశెట్టి శ్రీరామ్, పగడాల శంకర్, చింతలపాటి మాధవ కొంకి, రవి పసుపులేటి, శ్రీనివాసరావు కోయ, రామకృష్ణ రవి, నాగవరపు ఆంజనేయులు, వరి కోటి బాబురావు, గొట్టే నవీన్, రాజేష్ ప్రసన్న, ఆకాష్ దినకర, కేసరి జీవరత్నం తదితర జనసైనికులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *