పాడేరులో ఘనంగా జనసేన పంద్రాగస్టు ఉత్సవాలు

  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన డా. వంపూరు గంగులయ్య

పాడేరు నియోజకవర్గం: పాడేరు జనసేన కార్యాలయంలో అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆగస్టు 77వ స్వాతంత్ర దినం సందర్బంగా మంగళవారం జెండావిష్కరణ చేసి నియోజకవర్గ జనసైనికులకు, వీరమహిళలకు, నాయకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా గంగులయ్య గిరిజన జాతి నుద్దేశించి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాల ఫలితంగా సాధించుకున్న సరాజ్యం నేటికి ఆ స్వేచ్ఛ ఫలాలు ఆదివాసీ సమాజానికి అందని ద్రాక్షాలగా మిగిలిపోయింది. ప్రతి జనసైనికుడు దేశం నాకు ఏమిచ్చింది అనేదానికంటే నేను ఈ దేశానికి నా జాతికి ఏమివ్వాలి అని ఆలోసించగలగాలి స్వాతంత్ర్య వీరులను ఆదర్శవంతంగా తీసుకుని మీ పోరాట స్ఫూర్తి భావితరాలకు తెలిసేలా మీ నిబద్ధత, నిజాయితీ రాజకీయప్రక్షాళనకు గొప్ప ఆయువు పట్టుగా భావించి పనిచేయాలి. జనసేన పార్టీ ఇతర రాజకీయపార్టీలవలె కాదు ఉత్కృష్టమైన దేశభక్తి నరా నరాన జీర్ణించుకునే నవతరంతో సాగుతోంది. ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళ దేశ అభ్యున్నతికి మీ వంతు కృషిగా పని చేయాలని అటువంటి భావజాలం ఉన్న జనసేనపార్టీని క్షేత్రస్థాయిలో ప్రజాలవద్దకు తీసుకెళ్లే విదంగా ఆలోచన చేయాలని అన్నారు. వీరమహిళలు కిటలంగి పద్మ, బొంకుల దివ్యలత, దుర్గలత, నియోజకవర్గ ముఖ్యనాయకులు లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, మజ్జి సత్యనారాయణ, మాదేల నగేష్, భూపాల్, తదితరులు హాజరయ్యారు.