ఇచ్ఛాపురం జనసేన కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

ఇచ్ఛాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు సమక్షంలో కేక్ కటింగ్ చేసి, పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒకరికి ఒకరు పంచుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ ఈ 2023 సంవత్సరంలో ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.