ఘనంగా చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

  • భారీ బైక్ ర్యాలీ చేపట్టిన జనసైనికులు
  • చేబ్రోలులో అడుగడుగునా జేజేలు పలికిన గ్రామ ప్రజలు
  • ప్రభుత్వ విధానాలకు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం
  • పిఠాపురంలో ప్రజలు జనసేన వైపే ఉన్నారని ధీమా వ్యక్తం
  • సభ మొదలు అయినప్పటి నుండి పూర్తయ్యేవరకు కక్ష పూరితంగా పవర్ కట్ చేసిన స్థానిక ప్రభుత్వ యంత్రాంగం
  • జైల్లో ఖైదీలే జగన్ ను నమ్మే పరిస్థితి లేదంటూ నిప్పులు చెరిగిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం, శుక్రవారం చేబ్రోలులో జనసేన బీసీ సామజికవర్గానికి చెందిన నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి ఆదర్శ కాలేజీ నుండి చేబ్రోలు కార్యాలయం వరుకు బైక్ ర్యాలీతో భారీ జనసందోహం మధ్య ఘనంగా జనసైనికులు స్వాగతం పలికారు. ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని అడుగడుగునా ప్రజలను పలుకరిస్తూ తానా సెంటర్లో ఉన్న పార్టీ కార్యాలయానికి చేరుకొని, జనసేన బీసీ నాయకులు 10వ వార్డు మెంబర్ అయిన దమ్ము చిన్నా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఘనంగా బీసీ నాయకుల సమక్షంలో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని, కొత్త కొత్త విధానాలు తీసుకోనివచ్చి ప్రజలు ఆస్థులను కాజేసే కుట్రలు పన్నుతున్నారని, మీ దస్తవేజులు మీ దగ్గర లేకుండా ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుందని ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ప్రైమ్ 2.0 విధానం గురించి క్లుప్తంగా వివరించారు. సభలో మాట్లాడటం మొదలుపెట్టిన తరువాత మనల్ని ఎదుర్కోవడం చేతకాక కక్ష పూరితంగా పవర్ కట్ చేయడం అనేది ఓటమిని ఒప్పుకోవడమే అంటూ జగన్ ను జైల్లో ఉన్న ఖైదీలే నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యనించారు. అనంతరం కార్యాలయంనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ గ్రామంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా జనసేన పార్టీ కార్యాలయంకి విచ్చేసి సమస్యలు తెలియజేసిన యెడల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జనపార్టీ అధికార ప్రతినిధి దాసరి కిరణ్ మాట్లాడుతూ చేబ్రోలు గ్రామం మరియు గ్రామ ప్రజలు తనకు ఎంతగానో నచ్చారని, ఇంచార్జ్ ఒప్పుకుంటే చేబ్రోలు గ్రామంలోనే 200 గజాల స్ధలం కొనుక్కుని ఇళ్ళు కట్టుకుంటానని, పిఠాపురం అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి జనసైనికుడికి ప్రత్యేకం అని రాబోయే ఎన్నికల్లో పిఠాపురంలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించి జనసేన జెండాను ఎగురవేద్దామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జ్యోతూల్ శ్రీనివాసు, జనసేన నాయకులు వీరమహిళలు, జనసైనికులు మరియు గ్రామప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.