ఘనంగా చిత్తూరు జనసేన కార్యాలయ ప్రారంభం

  • డి3 ఫార్ములాను నమ్ముకున్న జగన్
  • ధనం, దౌర్జన్యం, దొంగ ఓట్లే వైసిపి ఎన్నికల ఆయుధాలు
  • చిత్తూరు జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు, ధనం, దౌర్జన్యం, దొంగ ఓట్లను వైసిపి ఆయుధాలుగా మార్చుకుందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. శుక్రవారం చిత్తూరులో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన టిడిపి నాయకులతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ చిత్తూరు ప్రజలు సంతోషించే విధంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. 14 ఏళ్లు సిఎంగా పనిచేసిన చంద్రబాబు అనుభవం, ప్రజలకు సేవ చేయాలన్న పవన్ కళ్యాణ్ ఆశయం ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలని, పార్టీలు కాదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాష్ట్రాన్ని, ప్రజలను గెలిపించేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రం అంధకారంలో ఉందని, జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిముతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు గోడల సాక్షిగా ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతం చేయాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తన ఉమ్మడి కుటుంబంలోనే 16 ఓట్లు ఉంటే వాటన్నింటినీ తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం, బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ది చేసేందుకు దోహదపడుతాయన్నారు. టిడిపి మేధోశక్తి‌తో కలిసి జనసేన యువశక్తి ఉమ్మడి పోరాటానికి సిద్దమైందన్నారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలిచి తీరుతారన్నారు. నియోజకవర్గ సమావేశాలు నిర్వహించి రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాయన్నారు. అంతకు ముందు జనసైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని టిడిపి, బిజెపి, జనసేన ముఖ్య నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్సులు ఆరణి కవిత, అకేపాటి సుభాషిణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, రాయలసీమ కో కన్వినర్ రాందాస్ చౌదరి, స్టేట్ ఐటి కో-ఆర్డినేటర్ ఉయ్యాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, సీనియర్ నాయకులు దయరాం, కార్యనిర్వహణ కార్యదర్శి శరవణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు తులసి ప్రసాద్ రాజేష్ యాదవ్, మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, జనసేన సీనియర్ మహిళా నాయకురాలు చామంతుల మల్లికా, మదనపల్లె జనసేన నాయకులు ధరణి, గోపాలకృష్ణ, నాగరాజు, కోటకొండ చంద్రశేఖర్, పాల్గున, గణేష్, చలపతి, కిరణ్, జిల్లా కార్యదర్శులు ఆనంద్, యస్వంత్, హేమకుమార్, భాను, దేవర మనోహర్, బాటసారి, మండల అధ్యక్షులు సంతోష్, ఉపాధ్యక్షులు రూపేష్, మురళి, తిరుపతి నగర నాయకులు పార్ధు, లక్ష్మి, కిరణ్ కుమార్, మనోజ్ కుమార్, గౌస్ బాషా, జనసైనికులు మోహిత్, ఇంద్ర, బాలాజీ, వీరమహిళలు అంజలి, వనిత, శిరీష, పుష్ప తదితర జనసేన నాయకులు, టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు, ఎక్స్ మార్కెట్ చైర్మన్ కాజురు బాలాజీ, నగర అధ్యక్షులు కటారి హేమలత పార్లమెంట్ యువత అధ్యక్షులు కాజురి రాజేష్, ముఖ్య నాయకులు గురజాల జగన్ మోహన్, ఎక్స్ తెలుగు యువత ప్రెసిడెంట్ వినయ్ చౌదరి, కిషోర్, కార్పొరేటర్ అశోక్, మాజీ కోర్పొరేటర్ రాణి తదితర నాయకులు పాల్గొన్నారు.