ఉంగుటూరు జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘనమైన నివాళులు

ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్బంగా ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాలకి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పించి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిధిగా జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కట్రెడ్డి చంద్రశేఖర్, వంగా రఘు, నవుడు బాబ్జి, రామకృష్ణ, లక్ష్మణ్, సురేంద్ర, సురత్తుల అయ్యప్ప మరియు జనసైనికులు పాల్గొన్నారు.