శ్రీకాళహస్తి జనసేన కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి ఉగాది పండుగ వేడుకలు జరుపుకోవడం జరిగింది. నూతన సంవత్సరంలో జనసేన పార్టీకి , పవన్ కళ్యాణ్ గారికి, నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకు మంచి జరగాలని ప్రార్థించడం జరిగింది. అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని కార్యకర్తలకు ప్రసాదంగా పంచిపెట్టారు.