గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో వంగవీటికి ఘన నివాళులు

స్వర్గీయ వంగవీటి మోహన రంగా వర్ధంతిని నెల్లూరు సుబేదార్ పేట వద్ద గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్బంగా కిషోర్ మాట్లాడుతూ.. ఎవడి దయా దాక్షిణ్యాల కింద బతకాల్సిన అవసరం లేదు. మనం ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నాము.. ధైర్యంగా బ్రతకండి అని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి తిరుగులేని ఆదర్శ నాయకుడుగా ఎదిగిన వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ… అధికార మదంతో విర్రవీగుతున్న కొన్ని కుటుంబాలకు సమాధానం చెప్పగలిగిన మొనగాడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే జోహర్ శ్రీ వంగవీటి మోహన రంగా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు గాదిరాజు అశోక్, కె ఆర్ పి ఆర్ ఓ పసుపర్తి కిషోర్ భవిశెట్టి కిషోర్, గునుకుల కిషోర్, భక్తవత్సలం, సుధామాధవ్, వంశీ, రఘ, శివ, పవన్ తదితరులు పాల్గొన్నారు.