రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు గుడివాడ అమరనాద్ నోరు అదుపులో పెట్టుకోవాలి: రాయపూడి వేణుగోపాల్ రావు

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, ఐటీ శాఖ మాత్యులు గుడివాడ అమరనాధ్ పవన్ కళ్యాణ్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసారు. మీ పార్టీలో ముఖ్య మంత్రి ఎవరు? జనసేన పార్టీ సినిమా పార్టీ అనీ, జనసేన పార్టీ 175 స్థానాలకు పోటీ చేస్తుందా, జనసేన కార్యకర్తలు చంద్రబాబుకు బానిసలు అవుతారని, ముద్రగడ పద్మనాభానికి అవమానం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని, 4నెలలు నుండి కాపులు గురించి మాట్లాడుతున్నారని, వంగవీటి మోహన్ రంగా హత్య గురించి, రంగా గారిని హత్య చేయించిన చంద్రబాబు నాయడుతో కలవటం ఏమిటి? అని అడిగినారు, ఆ విషయం పత్రికల్లో రావటం జరిగింది. ముందుగా మీరు మాట్లాడిడిన మాటలకు మా జనసేన పార్టీ తరుపున మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ, మహాత్మా గాంధీ ఆశయాలు, అంబేద్కర్ సిద్ధాంతాలు, భగత్ సింగ్ తెగువలో నుండి పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని ముందుగా సదరు మంత్రి తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ వృత్తి సినిమాలు, అలాగే మీ వైస్సార్సీపీ పార్టీలో కుడా రోజా అలిగారు, పదవులు అనుభవిస్తున్నారు. మీది కూడ సినిమా పార్టీయేనా? అలాగే జనసేన పార్టీ 2024 లో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రాకి 2024 లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి. మా పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది ఎన్నికలు ఇంకా టైమ్ ఉంది కాబట్టి అప్పుడు చూపిస్తాం జనసేన పార్టీ బలం ఏమిటి అనేది. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు ఎవ్వరికీ బానిసలు కాదు, ఒక నిజాయితీ, అవనీతి కేసులు లేని, ఒక్క కేసుకూడా లేని జనసేన పార్టీ అధ్యక్షులు క్రింద పని చేస్తున్న కార్యకర్తలం మేము మేము ఎవ్వరికీ బానిసలం కాదని సదరు మంత్రి గుర్తుపెట్టుకోవాలి. మీకు లాగా మీ నాన్న ఒక పార్టీ, మీ అమ్మ, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉంది ఇప్పుడు వైస్సార్సీపీ పార్టీలో మారి పూటకు ఒక పార్టీ మారుస్తూ బానిసలు లాగా బ్రతుకుతుంది మీరు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి, అదే విధంగా కాపుల విషయంలో, ముద్రగడ పద్మనాభం విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారు. ముద్రగడ పద్మనాభం విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించటం జరిగింది. 3% ఉన్నా రెడ్డి సామజిక వర్గం క్రింద 20% కాపులు ఉన్న సమాజకవర్గాన్ని తాకట్టు పెడుతుంది మీ లాంటి వారే. కుక్క బిస్కెట్లు లాంటి మంత్రి పదవులు కోసం జాతిని నాశనం చేస్తున్న మూర్ఖులు మీరు, మిమ్మల్ని కాపు జాతి ఎప్పటికి క్షమించదు అనే విషయం మంత్రి గుర్తు పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వంతో మాటలాడి ముద్రగడ పద్మనాభంపైన ఉన్న కేసులు ఎందుకు ఎత్తించలేకపోతున్నారు? ఇకపోతే వంగవీటి మోహన్ రంగా గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అన్నది రంగా అభిమానులు గ్రామానికి 10 మంది దీక్షా శిబిరం దగ్గర కాపలా ఉంటే రంగా చనిపోయే వారు కాదు కదా అన్నారు. అంటే గానీ కాపులు కాపాడుకోలేకపోయారని అనలేదు ప్రజలకు మీరు అబద్దాలు చెపుతున్నారు. అలాగే రంగా హత్యకు కారణం అయిన చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ఎలా కలుస్తున్నారు అన్నారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలవలేదు, చంద్రబాబు నాయుడు వచి పవన్ కళ్యాణ్ ని కలవటం జరిగింది. కళ్ళు పెట్టుకుని చూడండి. ఇకపోతే రంగా ని హత్య చేయించిన దేవినేని నెహ్రు కుమారుడు దేవినేని అవినాష్ మీ పార్టీలో ఉన్నారు. రంగాని పాముతో పోల్చి, రౌడీలను హత్య చెయ్యరా అని మాట్లాడిన గౌతమ్ రెడ్డి వైస్సార్సీపీ పార్టీలో ఉన్నారు. వారిని మీ దగ్గర పెట్టుకొని మీరు అందరు కలిసి తిరుగుతూ పవన్ కళ్యాణ్ ని అనడం ధర్మమా అని అడుగుతున్నాము. అలాగే వంగవీటి మోహన్ రంగా మీద మీకు ప్రేమ ఉంటే నూతన జిల్లాలో ఒక్క దానికైనా రంగా పేరు ఎందుకు పెట్టించలేదని అడుగుతున్నాము. ఇంకా మీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఇంకా రంగా పేరు వాడుకోవటం సిగ్గుచేటు అయిన విషయం బాధాకరం. రాష్ట్రంలో ఉన్నా కాపు జాతి మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇప్పిటికైనా గుడివాడ అమరనాద్ మీ నోరు అదుపులో పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే జనసైనికులు చూస్తూ ఊరుకోరు మీకు తగిన బుద్ది చెపుతారని జనసేన పార్టీ తరుపున, కాపు జాతి తరుపున హెచ్చిరిస్తున్నామని ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు అన్నారు.