మోసపోయిన అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు అండగా జనసేన

  • అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట తప్పిన జగనన్న

నూజివీడు నియోజకవర్గం: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి టీచర్లు మరియు హెల్పర్లు చేస్తున్నటువంటి నిరసన సమ్మెకు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్న సందర్భంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ వారి నిరవధిక సమ్మెకు మద్దతుగా ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరియు నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మరీదు శివరామ కృష్ణ జనసేన నాయకులు వారికి సంఘీభావం తెలుపుతూ వారి న్యాయ పరమైన కోరికలను తీర్చే వరకు ఈ సమ్మెలో జనసేన పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నివిధాల సహాయసహకారాలు ఇస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్ట నాయకులు ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామ కృష్ణ ముమ్మలనేని సునీల్ కుమార్ బండారు రాజు, చేరుకుపల్లి కిషోర్ నాగరాజు, మరియు నియోజకవర్గ వీరమహిళా నాయకురాలు రామిశెట్టి తేజస్విని పాల్గొన్నారు.