వైసిపి నేత దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన గుడివాడ జనసేన

గుడివాడలోని ఓ థియేటర్ కు అనుమతులు ఇవ్వలేదని మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి సమక్షంలోనే తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు పై వైసిపి నేత దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.

తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు పై దాడి, దళితుల పైన వైసిపి నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తహసీల్దార్ పై దాడికి పాల్పడిన మంత్రి అనుచరుడు పద్మా రెడ్డి ని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి… ఈ మీడియా సమావేశంలో కృష్ణా జిల్లా కార్యదర్శి కోదమల గంగాధర్ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ రూరల్ అధ్యక్షులు ఇంటూరి గజేంద్ర, జనసేన నాయకులు వడ్డాది లక్ష్మీకాంత్ ఇతరులు పాల్గొన్నారు.