ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు సవాల్ విసిరిన గుడివాక శేషుబాబు

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ జనసేన కార్యాలయంలో శేషుబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే పదేపదే అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనకు నాయకులు లేరని చెప్పటంపై మండిపడ్డారు. జిల్లాలోనే అత్యధిక సభ్యత్వాలు అవనిగడ్డ నియోజకవర్గంలోనే చేశామన్నారు. అవనిగడ్డ సీటు సింహాద్రి రమేష్ బాబుకు రాదని రోజూ టీవీల్లో, సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో ఆత్మ న్యూనతా భావానికి గురవుతున్న సింహాద్రి రమేష్ బాబు టీడీపీ, జనసేన పొత్తు గురించి పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కండిషన్ పట్టాల సమస్యపై టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన జీఓతో అవనిగడ్డ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అధికారులు పరిష్కారం చేసిన సమస్యను అప్పటి రెండు మండలాల అధికారులు చేయకపోవటంతో దాన్ని జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళితే అయిపోయే పనిని సీఎం జగన్మోహనరెడ్డిని ఆకాశం నుంచి తీసుకుని ఏదో ఒరగబెట్టినట్లు నియోజకవర్గ ప్రజలను పిచ్చి వాళ్ళను చేశారన్నారు. జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ మాట్లాడుతూ అభివృద్ధి అభివృద్ధి అనే ఎమ్మెల్యే ఎదురుమొండి బ్రిడ్జి నిర్మించారా? చల్లపల్లి ఫైర్ స్టేషన్ తెచ్చారా? ఘంటసాల బౌద్ధ క్షేత్రం అభివృద్ధి చేశారా? కోడూరు రోడ్డు నిర్మించారా? ఏ మండలంలో ఏం అభివృద్ధి చేశారు? అని ప్రశ్నించారు.