‘ఎవరు మీలో కోటీశ్వరులు’ మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ రామ్ చరణ్.. ఎన్టీఆర్ వెల్లడి

తెలుగు తెరపై అతిపెద్ద గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు. జెమినీ టీవీలో ఈ నెల 22 నుంచి ప్రసారం కానుంది. ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ప్రారంభ ఎపిసోడ్ (కర్టెన్ రైజర్)కు ముఖ్య అతిథి తన సోదరుడు రామ్ చరణ్ అని ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఓపెనింగ్ ఎపిసోడ్ ప్రోమోను పంచుకున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ జరిగిందని, ప్రేక్షకులకు ఎంతో వినోదం లభిస్తుందని వివరించారు.