గాంధీ మహాత్మునికి గుంతకల్లు జనసేన నివాళులు

గుంతకల్లు నియోజకవర్గం: గాంధీ జయంతి సందర్బంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నివాళి అర్పించిన అనంతపూర్ జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, నాయకులు పవన్ నెట్టి, అనంతపూర్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు సోహైల్, 31వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తాడిపత్రి విజయ్ కుమార్, మైనారిటీ నాయకులు షేక్ జీలన్ బాషా, యువ నాయకులు తాడిపత్రి మహేష్ కుమార్, మారుతీ యాదవ్, బాలాజీ, ఇబ్రహీం, ఆర్ సి సురేష్ కుమార్ (ఎల్.ఎల్.బి) మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపూర్ జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం హింసా మార్గం కాదు, అహింసే మార్గం అని ప్రతిఒక్కరు అహింసా మార్గంలో నడవాలని మహోన్నత మార్గం చుపిన వ్యక్తి మహాత్మా గాంధీ అని జీవన్ కుమార్ తెలిపారు.