డుంబ్రిగుడలో గాంధీ మహాత్మునికి ఘన నివాళులు

అరకు నియోజకవర్గం: డుంబ్రిగుడ మండలములో జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీకీ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అరకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏజెన్సీ గిరిజన మాన్య ప్రాంతము అభివృద్ధి లేకపోవటం గిరిజన మాన్య ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకు రోడ్లు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, గ్రామాలకు సిసి రోడ్ సౌకర్యం డ్రైనేజ్ కాలువ సౌకర్యం పంచాయతీ నిధుల ద్వారా చేయించలేని పరిస్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో చాలా బాధాకరమైన విషయమని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ బ్రిటిష్ పరిపాలన జరుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయని అపోహలు తెలియజేశారు. అలాగే చదువుకున్న యువత ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థులకు డీఎస్సీ పోస్టింగ్ తీస్తానని హామీలు ఇచ్చిన వైసిపి ప్రభుత్వం రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని అది చేయలేదు. మద్యపానం బంద్ చేస్తామని మద్యపానం బంద్ చేయలేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తామో పూర్తి చేస్తామని అది చేయలేదు. ప్రతి సంవత్సరము జాబ్ కేలండర్ విడుదల చేస్తామన్న నాయకులు అది కూడా చేయని పరిస్థితిలోవైసీపీ ప్రభుత్వం ఉన్నది కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు మభ్యపెట్టి అరాచకమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు గమనించి రానున్న రోజుల్లో జనసేన టిడిపిని మీరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి భావితరాల భవిష్యత్తు ఇవ్వాల్సిందిగా మన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించి గిరిజన మన్య ప్రాంతంలో కూడా మన పిల్లలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే రానున్న రోజుల్లో జనసేన టిడిపిని మీరు మద్దతు తెలుపాలని మనస్ఫూర్తిగా కోరుచు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.