గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది- జనసేన, టీడీపీల డిజిటల్ క్యాంపైన్

కడప: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా మాజీ కడపజిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో కడప టౌన్ గాంధీ నగర్ హైస్కూల్ నుంచి ప్రకాష్ నగర్ వేళ్ళే మార్గంలోని రాహదారిలో, గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది.. అనే డిజిటల్ క్యాంపైన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహన కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ పాల్గోని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెనింగ్ అనే కార్యక్రమంలో ద్వారా కడప నగరంలోని చాలా అద్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిని మేము సీఎం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది కానీ గడిచిన ఏడాది కాలంలో ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్న రోడ్డు వేయలేకపోయినా కనీసం ప్రజల అవసరాల నిమిత్తం మరమతులన్న చేపట్టేది గుంతల రాజ్యం గోతుల ప్రభుత్వంగా పేరు పోదిన మీరు ఇకనైనా మొద్దు నిద్ర విడిచిపెట్టి రోడ్లు వేసి కడప నగర ప్రజల కష్టాలను తీర్చాలని జనసేన మరియు తెలుగుదేశం పార్టీల తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప నియోజికవర్గ టిడిపి అధ్యక్షులు సాన్నపురెడ్డి శివకోండరెడ్డి, బెస్త సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ రాంప్రసాద్, అవుల వేంకటేష్ బీసీ నాయకులు రెడ్డయ్యా యాదవ్, క్రిష్టియన్ సెల్ జిల్లా అద్యక్షులు ప్రేమ్ కుమార్, బెస్త సాధికార కమిటీ జిల్లా సభ్యులు వర్డిబోయిన రాము, అమీర్, ఖాసీం, ఆవుల ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు మిరియల ఈశ్వర్, బాశెట్టి స్వరూప్, శేషురాయల్, దేవాకుమార్, బాలునాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, ఉపేంద్ర, రాము, శివ, శివసాయి, సాయికృష్ణ ఆచారి, రూప్ కుమార్ ఆచారి, సుబ్బరాయుడు, మరియు తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.