కన్నా ఆశ్రయ ఫౌండేషన్ సందర్శించిన గురుదత్ ప్రసాద్

రాజనగరం, కోరుకొండ మండలం, మధురపూడి ఎయిర్పోర్ట్ దగ్గర్లో మానసికంగా ఎదుగుదలని నోచుకోని పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫౌండేషన్. ఒక స్పెషల్ చైల్డ్ కి తల్లి, బ్యాంకు ఉద్యోగి, ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు మరోపక్క పరిపక్వత లేని బిడ్డ ఈ రెండింటి నడుమ ఎంతో ఓర్పుతో అటు ఉద్యోగాన్ని ఇటు బిడ్డని బాలన్స్ చేసిన సహనం. తన బిడ్డలా ఉన్న ఎంతోమంది స్పెషల్ చిల్డ్రన్ కోసం ఆలోచించి తన సొంత నిధులతో ఒక ఆశ్రమాన్ని ఏర్పరచి గత రెండు దశాబ్దాలుగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఇప్పటికీ 80 మంది పిల్లలతో ఆశ్రమాన్ని నడపడం ఎంతో మందికి ఆదర్శప్రాయం. రాజనగరం నియోజకవర్గం ఇంచార్జ్ మేడ గురుదత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప కన్నా ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి గండి శకుంతల దేవి ఆహ్వానం మేరకు కన్నా ఆశ్రయ ఫౌండేషన్ సందర్శించడం జరిగింది. గత రెండు దశాబ్దాలుగా తమ సొంత నిధులతో ఒక ప్రణాళికా బద్దంగా ఎంతో సేవా స్ఫూర్తితో ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది మానసిక పరిపక్వాత లేని పిల్లలని తీర్చిదిద్ధుతున్నందుకు శకుంతలని ఆమె కుటుంబాన్ని మేడ గురుదత్ అభినందించారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, తూర్పుగోనుగూడెం & పరిజల్లిపేట జనసేన పార్టీ ఎంపిటిస్ పల్లా నాగు, మన్య శ్రీను, రాజానగరం నియోజకవర్గం వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ, రాజానగరం మండల యూత్ ఐకాన్ పల్లా హేమంత్, చల్లా ప్రసాద్, వల్లేపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.