కె.పి.హెచ్.బి కాలనీ 6వ ఫేజులో ముమ్మారెడ్డి కుటుంబ సభ్యుల ప్రచారం

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, కె.పి.హెచ్.బి కాలనీ 6వ ఫేజులో ఎన్నికల ప్రచారంలో భాగంగా భాగంగా బిజెపి బలపరిచిన జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సతీమణి శ్రీమతి ముమ్మారెడ్డి విజయలక్ష్మి గడపగడపకు కరపత్రాలను పంచుతూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలని చెబుతూ ప్రచారం కొనసాగించారు. ప్రేమ కుమార్ ని గెలిపించాలని కోరారు. ఈ పాదయాత్రలో కుమార్తె తేజశ్రీ, కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, బిజెపి నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.