చిన్నారి పాపకు వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేసిన గురుస్వామి

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామం లో చిన్న పాపకు అనారోగ్య సమస్య వల్ల హాస్పిటల్ లో ఉండి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు శెట్టూరు మండలం, మాకోడికి గ్రామం జనసేన నాయకుడు గురుస్వామి మానవతా దృక్పథంతో చిన్నారి తల్లికి 5000 రూపాయలు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సమాజంపై ప్రేమతో కష్టాల్లో ఉన్న వాళ్లకి అండగా నిలబడాలనే.. ఎంతో కొంత మన వంతు బాధ్యతగా సహాయం చేయుట జరిగింది అని జనసేన నాయకుడు గురుస్వామి తెలియజేశారు. ఈ సందర్భంగా గురుస్వామికి జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్, సెట్టూరు మండలం కన్వీనర్ లేపాక్షి ఈరన్న, రామలింగ, ప్రేమ్ కుమార్, మురళి మొదలైన జనసేన కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.