జివిఎల్ నోట కాపుల మాట

కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు “చేగొండి హరిరామ జోగయ్య” వారి నివాసంలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు మర్యాదపూర్వకంగా కలసిన సందర్భంలో వారిని మర్యాదపూర్వకంగా కలసిన జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసి) సభ్యులు చేగొండి సూర్యప్రకాష్. జివిఎల్ మీడియాతో మాట్లాడుతూ… నేను సామాజికంగా ఎదురవుతున్న ప్రతీ సమస్యపై మాట్లాడుతూ ఉంటాను అలాగే ఇటీవలి కాలంలో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో రాజ్యసభలో కాపుల రిజర్వేషన్ల అంశంపై మాట్లాడటం జరిగింది. దానిని నేను రాజకీయ అజెండాగా కాక ఒక సామాజిక అజెండాగానే గుర్తించి మాట్లాడటం జరిగింది. గత 30 సంవత్సరములుగా ప్రతీ రాజకీయ పార్టీ కాపుల రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ అజెండాగానే చూశారు. కాని నేను కాపుల రిజర్వేషన్ల అంశానికి సంబన్దించిన అన్ని నివేదికలు కూలంకషంగా పరిశీలించిన తరువాతనే మాట్లాడటం జరిగింది. నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని కాను అయినను కాపుల రిజర్వేషన్ల అంశంపై మాట్లాడటానికి కారణం వారిపై గత కొన్ని దశాబ్దాలుగా వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విస్మరణ ధోరణి నన్ను తీవ్రంగా కదిలించింది ఎందుకంటే… బ్రిటిష్ కాలంలోనే ఓబిసి రిజర్వేషన్ స్టాటస్ ను అనుభవించిన కాపు సామాజిక వర్గాన్ని స్వాతంత్ర్యం అనంతరం వాటినుండి కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేసింది తరువాత కాలంలో దళిత ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య వారికి రిజర్వేషన్లు కల్పిస్తే వాటిని 5 సంవత్సరముల కాలం తిరగకుండా రద్దు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకూ వచ్చిన ప్రతీ ప్రభుత్వం కాపులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించాయి గాని వారి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఏమైనా అడిగితే 50 శాతం పైబడిన రిజర్వేషన్లు అమలు పరచడం వలన కోర్టులో అడ్డంకులు ఎదురవుతాయనే కారణంతోనే కాపులకు రిజర్వేషన్లు కల్పించలేక పోతున్నామనే వాదన ప్రతీ ప్రభుత్వం వినిపిస్తూ వస్తుంది కాని అసలు మీరు అమలు చేస్తేనే కదా కోర్టు లో ఇబ్బందులు వస్తాయో లేదో తెలిసేది ఒకవేళ కోర్టులో ఏమైనా ఇబ్బందులు వచ్చినా దానికి సంబంధించిన పూర్తి నివేదికను కోర్టుకు సమర్పంచి విజయం సాధించవచ్చు ఉదాహరణకు ఇతర రాష్ట్రాలలో 50 శాతానికి పైబడిన రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి అవి కోర్టులోనే ఉన్నాయి. ఆవిధంగా వారు విజయం సాధించినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యపడదు. ఒకవేళ నిజంగానే ఇబ్బందులు ఎదురైనప్పుడు 50 శాతానికి మించి రిజర్వేషన్లు అవసరమవుతున్న అన్ని రాష్ట్రాల విషయంలో ఒక నిర్దిష్టమైన చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కాని సుప్రీం కోర్టు కాని ప్రయత్నం చేస్తాయి ఇవన్నీ జరగాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయాలి. ఏదైనా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటే అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమే కాని అది కేంద్ర పరిధిలోని అంశం కాదు వీరు చేయాలనుకుంటే చేయగలరు ఎందుకంటే మహరాష్ట్ర లో మరాఠా రిజర్వేషన్లను అప్పటి బీజేపి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించకుండానే వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. తరువాత అది కోర్టుకు వెళ్లింది. దానికి తగిన నివేదికలను సమర్పించడంతో కోర్టు ఏకీభవించడం జరిగింది. అలానే రాజస్థాన్ లోనూ జరిగింది అదే విధంగా మీరెందుకు చేయలేరు. అలా చేయకుండా కేంద్రానికి పంపిస్తే వారెం చేస్తారు? విద్యుత్ శాఖకు సంబందించిన విషయాన్ని నీటిపారుదల శాఖ కు పంపిస్తే వారు ఇది మనకు సంబందించిన విషయం కాదని ప్రక్కన పెడతారు అలానే ఇక్కడ జరిగింది. ఇప్పటికైనా మీరు తప్పుడు ప్రచారాన్ని మాని మీ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని వెంటనే పరిష్కరించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు వంటి కాపు మంత్రులయిన వారు ఈ విషయములో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూటిగా మీకే చెబుతున్నాను. మీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందు పరచలేదని కప్పదాటు వ్యవహారం చేస్తుంది రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో కాపులను మోసగించి అందలమెక్కి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి కాపులను పూర్తిగా విస్మరించారు. కాబట్టి మీది(వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి) మీ తండ్రి (వై.ఎస్ రాజశేఖరరెడ్డి)ది ఒకే పార్టీ కాకపోయినా మీ నాన్నగారి పేరు చెప్పుకునే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి, మీది రాజన్నరాజ్యం అని మీరే చెప్పుకుంటున్నారు కాబట్టి మీ నాన్నగారు కాపులకు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోవాలని చెబుతున్నాను. బ్రిటీష్ కాలంలో రిజర్వేషన్లు పొంది స్వాతంత్ర్యానంతరం ఇప్పటి వరకూ విస్మరించబడిన ఏకైక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గమేనని నాకు తేటతెల్లమయింది. కాబట్టి మీరైనా స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరములల అవుతున్నా ఇంకా రాజకీయ పార్టీలనుండి స్వాతంత్ర్యం రాని కాపు సామాజిక వర్గానికి వెంటనే 2017 బిసి చట్టాన్ని అమలు చేసి వారికి రిజర్వేషన్లు కల్పించవలసిందిగా డిమాండ్ చైస్తున్నాను లేదా అంతకంటే ఎక్కువ మేలు చేసే మంచి చట్టాన్ని చేసి వారికి రిజర్వేషన్ల ఫలాలను అందించిన ఘనతను మీరే సొంతం చేసుకోవలసిందిగా తెలియతేస్తున్నాను. దీనంతటికీ ఆగష్టు 15ను ఒక నిర్దిష్ట గడువుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాను. ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ఈ డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచుతున్నాను. మీది భయపెడితే భయపడే ప్రభుత్వమని ఇటీవలి కాలంలో పిఆర్సి అంశంలో తేటతెల్లమయింది. అలాగే కాపు సామాజిక వర్గానికి కూడా వారి సమస్యను ఉద్యోగస్థుల వలే ప్రజాక్షేత్రంలోకి తీసుకు రావలసిన పరిస్థితులు వారికి తీసుకురారని భావిస్తున్నానని అన్నారు.