హ్యాపీ బర్త్ డే “పూజా హెగ్డే”

అందంతో పాటు అభినయం కూడా ప్రదర్శించగల హీరోయిన్ పూజ హెగ్డే పుట్టిన రోజు  నేడు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూజ 2010లో విశ్వసుందరీ  పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది. ముందుగా 2012లో ‘ముగమూది’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత 2014లో ఒక లైలా కోసం తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది పూజా. తెలుగులో రెండు సినిమాలు ఒక లైలా కోసం, ముకుందా చేసిన తర్వాత బాలీవుడ్‌లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ‘మెహెన్ జోదారో’సినిమాతో మెప్పించింది. 2017లో వచ్చిన అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో తనలోని గ్లామర్ యాంగిల్‌ని బయటపెట్టి తొలి హిట్‌ను అందుకుంది. ఈ చిత్రంలో తన అందాలతో కనువిందు చేసి స్టార్ హీరోల సరసన చోటు కొట్టేసింది. అరవింద సమేత వీర రాఘవ పూజా హెగ్డే కెరీర్‌ను మరో స్థాయికి చేర్చింది. ఈ సినిమాలో పూజా చేసిన అరవింద పాత్ర ఆమెకు నటిగానూ మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అప్పటి వరకు గ్లామర్‌ రోల్స్‌కే పరిమితమైన పూజాలో మంచి నటి కూడా ఉందని పరిచయం చేసింది ఈ సినిమా. ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ.