ఘనంగా రెడ్డి అప్పలనాయుడు జన్మదిన వేడుకలు

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పుట్టినరోజు వేడుకలను ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి ఏలూరులో పండుగ వాతావరణం నెలకొంది. ఏలూరులో 2024 కాబోయే ఎమ్మెల్యే రెడ్డి అప్పల నాయుడు అంటూ నినాదాలు చేశారు. పార్టీలకు అతీతంగా ఆత్మీయులు, బంధువులు, రెడ్డి అప్పల నాయుడు అభిమానులు, శ్రేయోభిలాషులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, కార్మిక సోదరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 వ డివిజన్ కు చెందిన చాట్ల రాము, లంక లక్ష్మి మరియు 6 వ డివిజన్ కు చెందిన పొన్నాడ సత్యనారాయణ, టి.రాజు, మహేష్ బాబు ఫ్యాన్స్ కార్యదర్శి గోపి మణికంఠ, రామ్మోహన్ రావు తదితరులు రెడ్డి అప్పల నాయుడు సమక్షంలో జనసేన పార్టీ లోకి చేరారు. అనంతరం 3 వ డివిజన్ లో ని సత్యనారాయణ పేట గణేష్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటాపురం పంచాయతీ లోని అంధుల పాఠశాలలో రెడ్డి అప్పల నాయుడు పుట్టినరోజు సందర్భంగా బలరాం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.