శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణ గారి అడుగుజాడల్లో వెళ్తూ, విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదరసమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.